సిఎం ఫడ్నవీస్‌కు తప్పిన హెలికాప్టర్‌ ప్రమాదం

devendra fadnavis
devendra fadnavis

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హెలికాప్టర్‌ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. రాయగఢ్‌ జిల్లాలో ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా నేల తడిగా ఉండడంతో కుదుపులకు లోనై ల్యాండ్‌ అయిన వెంటనే జారిపోయింది. పైలట్‌ కొన్ని సెకన్లపాటు నియంత్రణ కోల్పోయి వెంటనే తేరుకుని హెలికాప్టర్‌ను సురక్షితంగా దింపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హెలికాప్టర్‌లో ఫడ్నవీస్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఒక ఇంజినీరు, పైలట్‌, కో-పైలట్‌ హెలికాప్టర్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని జిల్లా ఎస్పీ అనిల్‌ పరాస్కర్‌ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మహాజనాదేశ్‌ సంకల్ప్‌ సభలో పాల్గొనేందుకు ఫడ్నవీస్‌ రాయగఢ్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2017లో లాథూర్‌లో ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ అయింది. ఈ ప్రమాదం నుండి కూడా సిఎం క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్‌ దెబ్బతిన్నా ఫడ్నవీస్‌కు మాత్రం ఏమీ కాలేదు. స్థానికులు సిఎంను హెలికాప్టర్‌ నుండి సురక్షితంగా బయటకు తీసుకురావటం విశేషం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/