మోది కంటే దేవెగౌడ పాలనే మెరుగు

kumara swamy
kumara swamy


బెంగళూరు: దేశ భద్రత విషయంలో మోది ప్రభుత్వం కంటే తన తండ్రి దేవెగౌడ ప్రభుత్వమే మెరుగ్గా పనిచేసిందని కర్ణాటక సియం కుమారస్వామి అన్నారు. దేవెగౌడ పది నెలల పాలనా కాలంలో దేశంలో ఏ ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోనూ ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా ఉందని అన్నారు. అనేకసార్లు భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణ తలెత్తిందని, కానీ ఏ ప్రధాని వారి రాజకీయ లబ్ది కోసం ఉపయోగించకోలేదన్నారు. మోద మాత్రం ఆయన స్వలాభం కోసం సైనిక చర్యలను వాడుకుంటున్నారని, ఇంతకన్నా నీచ రాజకీయాలు ఉండవని దుయ్యబట్టారు. మోదీయే స్వయంగా పాక్‌లో బాంబు వేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కాస్త ఆవేదనకు గురయ్యానని ..కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో తమ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజలు స్వాగతించాలన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/