ఢిల్లీ అల్లర్లు.. 22 మంది మృతి

Violence in Delhi
Violence in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ హింసాకాండలో ఇప్పటివరకు 22 మంది మరణించగా, 189 మంది గాయపడ్డారు. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతుందని గురు తేజ్‌ బహుదూర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పరిస్థితులు మితిమీరకుండా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ ప్రజలకు భద్రత కల్పించి, క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని కూడా సూచించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/