ఢిల్లీ మెట్రో రైళ్లలో ఉచిత వైఫై సేవలు..

ప్రారంభించిన మెట్రో సంస్థ ఎండీ మంగుసింగ్‌

Delhi Metro
Delhi Metro

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ తొలిసారి రైళ్లలో ఉచిత వైఫై సేవలు ప్రారంభించింది. నేటి నుంచి ఢిల్లీ మెట్రో రైళ్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ మెట్రోలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. సంస్థ ఎండీ మంగు సింగ్‌ ఈ సేవలను ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్టు లైన్‌ మొత్తం ఆరు స్టేషన్లతో 22 కిలోమీటర్లు పొడవునా ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రోలైన్‌ను 2011లో ప్రారంభించారు. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ భాగస్వామ్యంతో దీనిని నిర్మించారు. 2013 రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దీని నుంచి వైదలగ్గా..డీఎంఆర్‌సీ పూర్తి వాటా సొంతం చేసుకొంది. ఎయిర్‌పోర్టు లైన్‌లోని ఆరు మెట్రో స్టేషనల్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/