ఐపాడ్‌, మాంసాహారం, కావాలి:జైలులో గ్యాంగ్‌స్టర్‌ కోరికలు

బరువు తగ్గిపోతున్నానని వ్యాఖ్య
నో చెప్పిన అధికారులు

Gangster Neeraj Bawana
Gangster Neeraj Bawana

ఢిల్లీ: ఢిల్లీలోని తిహార్ జైలులో నేరాలకు పాల్పడి జైలులో శిక్ష అనుభవిస్తున్నా మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ అయిన నీరజ్‌ బవానా తనకు ఐపాడ్‌తో పాటు ఎఫ్‌ఎం రేడియో, ఇంటి భోజనం, మాంసాహారం కావాలంటూ జైలు అధికారులకు కోర్టు ద్వారా వినతి పత్రం ఇచ్చాడు. నకు జైల్లో బోర్ కొడుతోందని నీరజ్ అంటున్నాడు. మాంసాహారినైన తనకు జైలులో శాకాహారం మాత్రమే ఇస్తున్నారని దీంతో బరువు తగ్గిపోతున్నానని చెప్పాడు. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు.. అతడి కోరికలు జైలు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. తిహార్‌ జైలులో కేవలం శాకాహారం మాత్రమే ఇస్తామన్నారు. ఇప్పటికే జైలులో రేడియో ఉందని, దానిలోనే అతడు పాటలు వినవచ్చని అన్నారు. కాగా, దావూద్‌ ఇబ్రహీంను ఆదర్శంగా తీసుకుని నీరజ్ గతంలో నేరాలకు పాల్పడ్డాడు. 2015, ఏప్రిల్లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/