ఎన్నికల ప్రక్రియ అడ్డుకున్న కేసులో 3 నెలల జైలు

manoj kumar
manoj kumar, AAP mla

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్‌ కుమార్‌ ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నందుకుగాను 3 నెలల జైలుశిక్ష విధించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈస్ట్‌ ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ఏరియాలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నందుకు గాను మనోజ్‌ కుమార్‌కు ప్రత్యేక ఎంపి-ఎమ్మెల్యే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 3 నెలల జైలుశిక్ష విధించింది. ఐతే తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ రూ.10,000 పూచీకత్తుపై మనోజ్‌కుమార్‌కు బెయిల్‌ మంజూరుచేశారు.
విధినిర్వహణ ఉన్న అధికారులను అడ్డుకున్నందుకు గాను ఐపిసి 186 ప్రకారం కుమార్‌కు దోషిగా పేర్కొంటూ కోర్టు ఈ నెల 11న తీర్పునిచ్చింది. కుమార్‌ నేతృత్వంలో 50 మంది కార్యకర్తలు 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఎంసిడి స్కూలు ముందు ఆందోళనకు దిగడంలో ఓటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/