రాబర్ట్‌ వాద్రా బెయిల్‌ పొడిగింపు

robert vadra
robert vadra


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్‌ వాద్రాకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ గడువును మార్చి 25 వరకూ పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. లండన్‌లో ఉన్న 1.9 మిలియన్‌ పౌండ్ల విలువచేసే స్థిరాస్తి కొనుగోలు విషయంలో వాద్రా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆయనపై ఈడి ఆరోపణలు చేసింది. ఆ సమయంలో అతను కోర్టును ఆశ్రయించగా, అతణ్ని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ బెయిల్‌ గడువు నేటితో ముగియనున్నతరుణంలో వాద్రా మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ ముందస్తు బెయిల్‌ గడువును మార్చి 25 వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇదే తరహాలో నాలుగు మిలియన్‌, దానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడానికి తమకి అనుమతివ్వాలని ఈడి కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈడికి సహకరించాలని వాద్రాకు కోర్టు సూచించింది.