ప్రజలు న్యాయవ్యవస్థను విశ్వసించడం లేదు

Arvind Kejriwal
Arvind Kejriwal

ఢిల్లీ: షాద్‌నగర్‌లో దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు తెలంగాణ పోలీసులకు దేశం నలుమూలల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రం ఎన్‌కౌంటర్‌ పై సంచలన కామెంట్స్‌ చేశారు. హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌నే దేశ ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారని..ఇది కూడా చింతిచాల్సిన విషయమని ఆయన అన్నారు. ఎన్‌కౌంటర్‌ పై హర్షం చేస్తున్న ప్రజలు..దేశ న్యాయవ్యవస్థ విశ్వసించడం లేదని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల గౌరవం కలిగించే మార్గాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డారు కేజ్రీవాల్‌. కాగా మరోవైపు రాజకీయ నాయకులు, పలు పార్టీలు ఈ ఎన్‌కౌంటర్‌ని స్వాగతిస్తున్నారు. ఇలాంటివి జరిగితేనే దేశంలో మహిళల పట్ల అఘయిత్యాలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/