క్షతగాత్రులను పరామర్శించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

Delhi CM Arvind Kejriwal visited GTB Hospital
Delhi CM Arvind Kejriwal visited GTB Hospital

న్యూఢిల్లీ: ఢిల్లీ‌లో జరిగిన హింసాకాండలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మ‌రికొంద‌రు గాయాల‌పాల‌య్యా‌రు. గాయపడిన క్షతగాత్రులను ఢిల్లీ‌లోని జిటిబి ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పరామర్శించారు. కేజ్రీవాల్‌ వెంట ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తదితరులున్నారు. హింసాకాండకు పాల్పడటం సరైన విధానం కాదని ఆయన అన్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి బాధాకరమని ఆయన అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/