నన్ను ఏ క్షణంలోనైనా చంపుతారు

అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

Delhi CM Aravind Kejriwal
Delhi CM Aravind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఆయన్ను చంపేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బిజెపి కారణంగా తాను ఏదో ఒక రో జు మాజీ ప్రధాని ఇందిరా గాంధీవలే హత్యకు గురవుతానని అన్నారు. ఇందిరాను చంపినట్టుగానే గన్‌మెన్స్‌ ఏత బిజెపి చంపిస్తుందని కేజ్రీవాల్‌ బిజెపిపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతున్నాయి. మొదటి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు, కేంద్ర ప్రభుత్వం మధ్య అధికారాల విషయంలో వివాదం నెలకొంది. దీంతో కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్ర మోడీపై పలు సంద ర్భాల్లో విరుచుకుపడ్డారు. ఈనేపథ్యంలోనే ఎన్ని కల్లోకూడా రెండు పార్టీల నేతలు ఘాటు విమ ర్శలు చేసుకున్నారు. మరోవైపు ఆప్‌ ఎంఎల్‌ఏలు ఒక్కొక్కరుగా బిజెపి పంచన చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యం నెలకొంది.తాజాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహిస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌పై కాన్వా§్‌ు ఉండగానే ఓ యువకుడు దాడి చేశాడు. దీంతో వెంటనే తేరుకున్న ఆప్‌ కార్యకర్తలు దాడి చేసిన యువకుణ్ని పట్టుకుని చితకబాదారు. కాగా ఈదాడిని ఖండించిన కేజ్రీవాల్‌ గతంలో 9సార్లు ఆయనై దాడి జరిగిందని బిజెపిపై ఆరోపణలు చేశారు. వారి ప్రోద్బలం వల్లే దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శలు చేశారు. తుదిదశ ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లా డుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెబుతున్న ట్లుగా గతంలో 9సార్లు జరగడంతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా కొంతమంది కేజ్రీవాల్‌ దాడికి పాల్పడ్డారు. రోడ్‌షోలో భాగంగా కోడిగుడ్లు, ఒకసారి ఇంకుతో మరోసారి దాడి చేశారు. 2014లోనూ వారణాసిలో మోడీపై పోటీచేసినప్పుడు కూడా ఆయనపై దాడి జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆయన చెంపను చెల్లుమనిపించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే అరవింద్‌ కేజ్రీవాల్‌ నా ప్రాణాలు ఏక్షణమైనా పోవచ్చని ఇందిరాగాంధీని చంపినట్టే తన అంగరక్షకులే చంపేస్తారని ఆయ న్నారు. మరోవైపు ప్రతిక్షణం ఆయన చుట్టూ ఉన్న పోలీసులు ప్రతి సమాచారాన్ని కేంద్రానికి అందిస్తున్నారని. ఈనేపథ్యంలోనే ఆయన పర్సనల్‌ సెక్యూరిటీ అధికారి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తారని అన్నారు. ఈనేపథ్యంలోనే తాను అంగరక్షకుల చేతిలో హతమవుతానని ఆవేదన వ్యక్తం చేశారు.