విమానాశ్రయాల్లో భద్రతకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

bullet-resistant vehicles
bullet-resistant vehicles


న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి అనంతరం దేశంలోని ప్రముఖ నగరాల్లో కట్టుదిట్టమైన భారీ భద్రతకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిఐఎస్‌ఎఫ్‌ బలగాలకు ఆరు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కేంద్రం సమకూర్చింది. విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించడంలో భాగంగా కేంద్రం సిఐఎస్‌ఎఫ్‌ క్విక్‌ రియాక్షన్‌ టీంకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను అప్పగించింది. ఒక్కో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం విలువ 25 నుంచి 40 లక్షల వరకు ఉంది. ఈ వాహనాలకు లైట్‌ మెషీన్‌ గన్‌లను కూడా ఏర్పాటు చేయించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల భద్రత కోసం సిఐఎస్‌ఎఫ్‌ ఈ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీతో పాటు దేశంలోని అహ్మదాబాద్‌, చెన్నై, ముంబై నగరాల్లోని విమానాశ్రయాల్లో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది.