రాజ్‌నాథ్‌ సింగ్‌ సియాచిన్‌ పర్యటన

rajnath singh
rajnath singh

సియాచిన్‌: రక్షణమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రాజ్‌నాథ్‌ సింగ్‌..ఇవాళ కశ్మీర్‌లోని సియాచిన్‌ గ్లేసియర్‌లో పర్యటించారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులతో రాజ్‌నాథ్‌ కాసేపు ముచ్చటించారు. వీరసైనికులకు ఆయన నివాళి అర్పించారు. సియాచిన్‌ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తిస్తూ ఇప్పటివరకు సుమారు 1100 మంది సైనికులు మరణించారు. ఆ అమరవీరుల సేవలకు, త్యాగాలకు జాతి రుణపడి ఉందని రాజ్‌నాథ్‌ అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/