మృతి చెందిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌

Royal Bengal tiger
Royal Bengal tiger

మహారాష్ట్రం: మహారాష్ట్రంలోని సంజయ్‌ గాంధీ జాతీయ పార్కులో 12 ఏళ్ల రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ యాష్‌ మృతి చెందింది. అయితే కొంతకాలం నుండి ఈ మగ పులి క్యాన్సర్‌తో బాధపడుతు మంగళవారం మృతి చెందినట్లు పార్కు సిబ్బంది తెలిపింది. కాగా యాష్‌కు మృదుకణజాలం పూర్తిగా క్షీణించడంతో పాటు అవయవాలన్నీ దెబ్బతినడం వల్లమృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలింది. శవపరీక్ష అనంతరం యాష్‌కు అంత్యక్రియలు చేశారు. యాష్‌కు రెండుసార్లు క్యాన్సర్‌ చికిత్సలు నిర్వహించారు. మొదటిసారి 2018, ఆగస్టులో చికిత్స నిర్వహించి వెనుక కాలి నుంచి 150 గ్రాముల ట్యూమర్‌ను తొలగించగా, రెండోసారి ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స చేసి ముఖం నుంచి 400 గ్రాముల కణితిని తొలగించారు. రెండో శస్త్రచికిత్స అనంతరం ఆ మగ పులి పూర్తిగా అస్వస్థతకు గురైంది. బరువు తగ్గింది. దీంతో యాష్‌ మంగళవారం కన్నుమూసింది.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/