అమిత్‌ షాతో డీఎస్‌ సమావేశం!

Amit Shah, D.Srinivas
Amit Shah, D.Srinivas

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను టిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ గురువారం పార్లమెంట్‌ భవనంలోని షా ఛాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. బిజెపి లో చేరకుండానే ఆయన కీలక నేతగా వ్యవహరించబోతున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. అంతకు ముందు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో డీఎస్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. తనను ఎందుకు దూరం పెట్టారో కేసీఆర్‌నే అడగాలన్నారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మైత్రిలో కీలక పాత్ర పోషించిన డీఎస్‌.. ఆ తర్వాత టీఆర్‌ఎ్‌సలోనే చేరారు. కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/