తల్లిని కలిసేందుకు కూతురికి కోర్టు అనుమతి

mufti
mufti


శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు జాగ్రత్తగా అక్కడి ప్రధాన నాయకులను కేంద్ర ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీని ఆమె కూతురు కలిసేందుకు కోర్టును ఆశ్రయించింది. ముఫ్తీ కూతురు విన్నపాన్ని విన్న కోర్టులు తల్లిని కలిసేందుకు ఆమెకు అనుమతిచ్చింది. అదేవిధంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సిపిఎం నాయకుడు యూసుఫ్‌ తరిగామిని చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించేందుకు కూడా కోర్టు అనుమతి జారీ చేసింది. స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఉద్యమించి అరెస్టయిన నాయకులను పిటిషన్‌లను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్లను పరిశీలించేందుకు బెంచ్‌ సమయాన్ని నిర్ణయిస్తామని చెప్పింది. జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా గృహనిర్భంధంలో ఉన్న తన తల్లిని కలిసేందుకు అనుమతించాలని కోర్టులోను కోరింది. రాష్ట్రంలో ముందు జాగ్రత్తగా ఆమె తల్లిని నిర్బంధంలో ఉంచారని, శ్రీనగర్‌కు తిరిగి వచ్చాక ఆమె తల్లిని కలుసుకోవచ్చనని ఆమె పిటిషన్‌ను పరిశీలన తరువాత జిల్లా అధికారులు చెప్పారు. తరిగామిని కలిసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సీతారాం ఏచూరీకి కూడా ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. కాశ్మీర్‌ రాజకీయవేత్త, కమ్యూనిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి కలిసేందుకు ఏచూరి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌కు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించిందని వారు చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/