ప్రజలే హైకమాండ్‌గా భావించే వ్యక్తే ప్రధానిగా ఉండాలి

PM Modi
PM Modi

చిత్రదుర్గ: ప్రధాని మోడి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కర్ణాటకలోని చిత్రదుర్గలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు కేవలం అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. అధికార దాహంతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం..కొంతమంది కూటమి నేతలు ఏమి చెబితే అదే చేస్తోందని, ఆ రిమోట్‌ వారందరి చేతుల్లో ఉందంటూ ఎద్దేవా చేశారు.ప్రజలే తన హైకమాండ్‌గా భావించే పార్టీకి చెందిన వ్యక్తే దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలకు సూచించారు. భారత్‌ అంటే ఏమిటో పాకిస్థాన్‌కు తెలియజేయడానికి బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపామని వివరించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/