నాసా ఫొటోల్లో దొరకని ‘విక్రమ్‌ ఆచూకీ!

chandrayan
chandrayan

న్యూఢిల్లీ: చంద్రయాన్‌ -2లో చివరి నిమిషంలో ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ ఆగిపోయి ఆచూకీ లభ్యం కాని విషయం తెలిసిందే. దీంతో విక్రమ్‌ జాడ కనుక్కునేందుకు నాసా ముందుకు వచ్చింది. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో తమ లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ నుంచి రెండు రోజుల క్రితం ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లో ఎక్కడా విక్రమ్‌ జాడ కనిపించడం లేదని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని నాసా తెలిపింది. ఫొటోలు తీసే సమయానికి ల్యాండర్‌ నీడలో ఉండడం గాని, నిర్దిష్ట ప్రాంతానికి అవతల గాని ఉన్నటయితే ఫొటోల్లో కనిపించకపోవడం విశేషం కాదన్నారు. పాత ఫొటోలతో పోల్చి చూస్తే వాస్తవం తెలియదని నాసా ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌కెల్లర్‌ తెలిపారు. తమ ఆర్బిటర్‌ చంద్రుని ఉపరితలానికి అతి దగ్గర నుంచి ఫొటోలు తీయం వల్ల నీడ ఎక్కువగా పడిందని నాసా తెలిపింది. కాగా విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు తమ మంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో ప్రకటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/