అమెరికాలో కరోనా మరణ మృదంగం

ఒక్క రోజులోనే 3,856 మరణాలు

corona virus
corona virus

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా భీభత్సం సృష్టింస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరగడంతో పాటు, మరణాలు కూడా బారీగా సంభవిస్తున్నాయి. గడచిన 24 గంటలలో ఈ వైరస్‌ కారణంగా అమెరికాలో 3,856 మంది మృతి చెందారు. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 36,607గా నమోదయింది. కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. ఇప్పటి వరకు 7,06,309 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ వైరస్‌ భారినుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కొంత ఊరట నిచ్చే అంశం. ఇప్పటి వరకు అమెరికాలో దీని భారినుండి 58,478 మంది కోలుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/