యూనిఫాంలో ఎస్‌ఐ టిక్‌ టాక్‌ వీడియో పోస్టు

 Cop  posting videos in uniform
Cop posting videos in uniform

lucknow: విధి నిర్వహణలో ఉన్న ఒక సబిన్‌స్పెక్టర్‌ యూనిఫాంలో ఉండగానే టిక్‌ టాక్‌ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఎస్‌ఐ మొహమ్మద్‌ ఆరిఫ్‌ పోస్టు చేసిన ఈ టిక్‌ టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఒక వీడియోలో ”ఇది పోలీస్‌ స్టేషన్‌ … మీ తండ్రి ఇల్లు కాదు … కూర్చోవాలని చెప్పే వరకూ నిలబడి ఉండు” అని ఆరిఫ్‌ అన్నట్లుగా ఉంది. రెండవ వీడియోలో ”పోలీసులతో స్నేహం కాని, శత్రుత్తవం కాని మంచిది కాదు” అని ఉంది. ఈ రెండూ వైరల్‌ అయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ఎస్‌ఐనుంచి వివరణ కోరుతామన్నారు.