అమేథిలో రాహుల్‌ నామినేషన్‌

Rahul Gandhi files nomination family joins him
Rahul Gandhi files nomination family joins him

అమేథీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా ఈరోజు ఆయన తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. రాహుల్‌ నామినేషన్‌ సమయంలో ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రా ఉన్నారు. నామినేషన్‌కు ముందు రాహుల్‌, ప్రియాంక అమేథిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో రాబర్ట్‌ వాద్రాతో పాటు వారి పిల్లలు రేహన్‌, మిరాయా కూడా పాల్గొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/