అహింసా సిద్ధాంతాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకం

న్యూఢిల్లీ : నేడు ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో కోన్ని అంశాలను వెల్లడించారు.జాతిపిత మహాత్మా గాంధీ దండి యాత్ర చేపట్టి నేటికి 89 ఏళ్లు.1947 తర్వాత కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ అలోచించినట్లు మోదీ తెలిపారు.తన అహింసా సిద్ధాంతాలకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకంగా ఉందని మహాత్మా గాంధీ భావించినట్లు చెప్పారు. అసమానత్వాన్ని, కుల విభజనను గాంధీ సహించేవారు కాదని ఆయన రాసుకున్న పుస్తకాల్లో ఇది స్పష్టంగా కనిపించేందన్నారు.కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సమాజాన్ని విభజించిందని మోదీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేడు కాంగ్రెస్‌ గుజరాత్‌లో భేటీ అవుతున్నది.సీడబ్ల్యూసీ నేతలంతా గాంధీ ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గోంటున్నారు. కాంగ్రెస్‌ తీరును మోదీ తప్పుపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/