అక్టోబర్‌ 15నుంచి కాంగ్రెస్‌ ఆందోళనలు

Congress party Rally (file)
Congress party Rally (file)

New Delhi: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక రంగం మందగమనంలో పడటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 15నుంచి 25వ తేదీ వరకూ ఆందోళనలను నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఎఐసిసి సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జులు, సిఎల్‌పి నేతలు పాల్గొన్నారు.