తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశం!

congress
congress


బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురి పాకాన పడింది. అక్కడ రాజకీయాలు నిమిష నిమిషానికి మారిపోతున్నాయి. కాంగ్రెస్‌-జేడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరూ రాజీనామాలు చేయాలన్న నిర్ణయానికి రావడం, సియం కుమారస్వామి రాజ్‌భవన్‌కు చేరుకోవడం చకాచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ అత్యవసరంగా భేటి కానుంది. ఈ సాయంత్రం 7 గంటలకు సీనియర్‌ నేతలు సమావేశం కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభం, తాజా పరిస్థితులపై చర్చించే అవకాశముందని సమాచారం.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/