సుజిత్‌ క్షేమంగా బయటకు రావాలి

మూడు రోజులుగా బోరుబావిలోనే సుజిత్

Rahul Gandh
Rahul Gandh

న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టిలో సుజిత్ విల్సన్‌ అనే మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా అతడు అందులోనే ఉన్నాడు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకొంటుంటే, ఆ రాష్ట్రం మాత్రం సుజిత్ కోసం ఎదురు చూస్తోందని, ఆ బాలుడిని రక్షించుకోవాలన్న ప్రయత్నంలో ఉందని ట్వీట్ చేశారు.ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ శుక్రవారం బోరుబావిలో పడిపోయాడని తనకు తెలిసిందని రాహుల్ చెప్పారు. అతడు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బాలుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా, బోరుబావిలో ఆ బాలుడు 88 అడుగుల లోతుకు జారిపోయాడు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/