ఈడీ ఎదుట హాజరైన డీకే కుమార్తె ఐశ్వర్య

DK Shivakumar daughter Aisshwarya
DK Shivakumar daughter Aisshwarya

న్యూఢిల్లీ: కర్నాటక మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ కుమార్తె ఐశ్వర్య గురువారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. మంగళవారం ఆమెకు ఇడి సమన్లు జారీచేసింది. డికె శివకుమార్‌ను ఇడి కస్టడీలోకి తీసుకున్న తరువాత కస్టడీ కాలం ముగుస్తున్న ఒక రోజు ముందు ఐశ్వర్యను ఇడి ప్రశ్నిస్తోంది. బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్య కునిగల్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ వెంట రాగా గురువారం ఉదయం 10.50 గంటలకు న్యూఢిల్లీలోని ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. ఐశ్వర్య పేరిట ట్రస్టు ఏర్పాటు చేయడం, ఆమె సంపద 2013-18 కాలంలో భారీగా పెరగడం గురించి ఇడి ప్రశ్నిస్తోంది. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐశ్వర్యకు రూ.108 కోట్ల ఆస్తులు ఉన్నట్లు డికె శివకుమార్ ప్రకటించారు. 2013లో ఆమె పేరిట కేవలం రూ. 1.09 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/