కాంగ్రెస్‌ ఎమ్మెల్యె అదితీ సింగ్‌పై దాడి

Aditi Singh
Aditi Singh

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీ లోని హరచంద్‌పనూర్‌లో కాంగ్రెస్‌ మహిళ ఎమ్మెల్యె అదితీ సింగ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. అయితే ఆమె రాయ్‌బరేలీ పంచాయతీ అధ్యక్షుడు, బిజెపి నేత అవదేశ్‌ సింగ్‌ విశ్వాస పరీక్షకు హాజరు అయ్యేందుకు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈఘటనలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతు దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది.ఖరెండు కార్లలో వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. దాదాపు 50 మంది దాడికి ప్రయత్నించారు. వారి చేతుల్లో రాడ్లు ఉన్నాయి.. మాపై రాళ్లు రువ్వారు. మరోవైపు అవదేశ్‌ సింగ్‌ ఓ కారులో కూర్చొని ఉన్నాడుగ అని తెలిపారు. ఈ దాడి వెనుక రాయ్‌బరేలీ భాజపా లోక్‌సభ అభ్యర్థి, అవదేశ్‌ సింగ్‌ సోదరుడు దినేశ్‌ సింగ్‌ ఉన్నారని అదితీ సింగ్‌ ఆరోపించారు.దీనిపై చర్యలు తీసుకుంటాంగ అని పోలీసులు తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/