కాంగ్రెస్‌కు అధ్యక్షుడు లేకపోవడమే సమస్య: ఖుర్షిద్‌

salman khurshid
salman khurshid

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసినప్పటి ఆ పార్టీకి సరైన అధ్యక్షుడి నియామకం జరగలేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షిడ్‌ వాపోయారు. వైఫల్యాలను గుర్తించడంలో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి కూడా కారణాలు ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేకపోయామని, పరిస్థితిపై పూర్తిగా విశ్లేషణ జరగలేదని, ఆయన అన్నారు. అధ్యక్షపదవి నుండి రాహుల్‌ తప్పుకున్నాక అద్యక్ష పదవి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మా నాయకుడు వీటన్నింటికి దూరంగా ఉంటున్నాడని, ఆయన అధ్యక్షుడిగానే ఉండాల్సిందన్నారు. సరైన నాయకుడు లేకపోవడమే పెద్ద సమస్యగా మారిందని సోనీయాగాంధీని నియమించుకున్నప్పటికి ఆమె తాత్కాలిక అధ్యక్షురాలినేగా భావిస్తున్నారన్నారు. ఇలా అయితే రానున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యుర్థులను ఎదురొఎ్కవడం కష్టమని ఖుర్షిద్‌ అన్నారు. ఈ యేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ 52 స్థానాలో మాత్రమే గెలిచిందని, ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, అప్పటి నుంచి పార్టీకి సరైన అధ్యక్షుడు లేకపోవడంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/