మీటింగ్‌ ను రద్దు చేసుకున్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి రాణదీప్‌ సూర్జీవాలా ఓ కార్యక్రమం లో మాట్లాడుతూ,ప్రస్తుత పరిస్థితులో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు కోనసాగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అందుకే సీడబ్ల్యూసీ మీటింగ్‌ ను తాము రద్దు చేసుకున్నామని చెప్పారు.మన యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ కూల్చివేసిందంటే. ఉద్రిక్తత మరింత పెరుగుతోందని అర్థమని అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం స్థిరమైన నిర్ణయానికి వచ్చేంత వరకు తాము మౌనంగా ఉంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం చేయడం సరికాదని అన్నారు.