గూగుల్ సెర్చ్ లో తిరుగులేని అభినందన్

abhinandan
abhinandan

ఇంటర్‌ నెట్‌ డెస్క్‌: బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం జరిగిన వైమానిక దాడులతో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు జాతీయస్థాయిలో హీరో ఇమేజ్ లభించింది. పాక్ యుద్ధ విమానాన్ని వీరోచితంగా తరిమికొట్టిన వర్ధమాన్ ఆ క్రమంలో పాక్ బలగాలకు దొరికిపోవడం, చెక్కుచెదరని స్థైర్యంతో భారత రక్షణ రంగ రహస్యాలను ఎక్కడా వెల్లడించకపోవడం అభినందన్ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి. తాజాగా, గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా వెదికిన ప్రముఖుల జాబితా విడుదల చేయగా, అందులో అభినందన్ కు ప్రథమస్థానం లభించింది. ఓ సీజన్ లో అభినందన్ పేరు విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ వింగ్ కమాండర్ కు చెందిన వార్తలు, వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో అధికభాగాన్ని ఆక్రమించాయి. ఇక గూగుల్ ఇండియా విడుదల చేసిన టాప్ సెర్చ్ జాబితాలో అభినందన్ వర్ధమాన్ తర్వాత రెండో స్థానంలో గానకోకిల లతా మంగేష్కర్, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మూడో స్థానంలో ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/