ఒక్క పౌరుడిగా నాకు అడిగే హక్కు ఉంది

Congress chief Sam Pitroda
Congress chief Sam Pitroda

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సలహాదారు శామ్‌ పిట్రోడా ఆంగ్ల వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతు.. ఇటివల భారత్‌ వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై చేసిన దాడిలో వాస్తవికతను ప్రశ్నించారు. వారు 300 మందిని చంపితే మంచిదే. కాకపోతే నేను అడిగేది ఒక్కటే.. దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు, వాస్తవాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను న్యూయార్క్‌ టైమ్స్‌, ఇతర పత్రికలు చదివాను. అసలు మనం దాడి చేశామా..? 300 మందిని చంపామా..?నాకైతే తెలియదు. ఒక పౌరుడిగా నాకు అడిగే హక్కు ఉంది.. నేను అడుగుతాను. అంతమాత్రాన నేను ఇటు వైపో..అటు వైపో ఉన్నట్లు కాదు. మనకు మరిన్ని నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు 300 మందిని చంపితే భారత ప్రజలకు తెలుసుకొనే హక్కు ఉంది. కానీ ప్రపంచ మీడియా మాత్రం అక్కడ ఎవరూ చనిపోలేదనే చెబుతోంది. ఒక భారతీయ పౌరుడిగా నాకు అది ఏమాత్రం బాగోలేదు.
నేను గాంధేయ వాదిని. దయా, గౌరవం వంటి అంశాలను నమ్ముతాను. చర్చలపైనే నాకు నమ్మకం ఉంది. పాకిస్థాన్‌తో మాత్రమే దేనికి. మనం ప్రతిఒక్కరితో చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తంతో చర్చించాలి. ఇవన్నీ నా వ్యక్తిగతంగా అడుగుతున్నవే. ఒక శాస్త్రవేత్తగా అడుతున్నవి. నేను కారణాలు, లాజిక్‌, ఆధారాలను నమ్ముతాను. నేను భావోద్వేగాలను నమ్మను. అని అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పనితీరును శామ్‌ పిట్రోడా వెనుకేసుకొచ్చారు. చాలా మంది ప్రజలు ఆయన విషయంలో తప్పుగా అనుకొంటారు. చాలా సినిమాలు తీశారు. అదంతా కేవలం తప్పుడు ప్రచారమే. పుల్వామ తర్వాత ప్రస్తుత ప్రధాని మోడి తీరును నేను వ్యతిరేకిస్తున్నా అని పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/