కేరళలోని విద్యార్థికి నిఫా వైరస్‌

Nipah virus
Nipah virus

న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకుళంకు చెందిన 23 ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధ్రువీకరించింది. అయితే ఈ విద్యార్థి ఇడుక్కిలోని తోడుపుళాలోని కాలేజీలో చదువుతున్నాడు. ఇటీవల ఓ క్యాంప్‌ నిమిత్తం త్రిశూర్‌ వెళ్లి నాలుగు రోజుల పాటు ఉన్నాడు. ఆ సమయంలోనే అతడికి జ్వరం వచ్చింది. క్యాంప్‌ నుంచి తిరిగొచ్చాక కూడా జ్వరం తగ్గకపోవడంతో తాజాగా కోచిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు నిఫా వైరస్‌లాగా ఉండటంతో అనుమానించిన వైద్యులు అతడి నుంచి సేకరించిన నమూనాలను పుణెకు పంపించారు. ఈ నమూనాలను పరిశీలించిన ఎన్‌ఐవీ.. అతడికి నిఫా సోకినట్లు నిర్ధారించింది.
నిఫా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత రోగికి దగ్గరగా ఉండేవారికి వస్తుంది. అలా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ వల్ల తొలి దశలో తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి కలుగుతుంది. తర్వాత శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తుతుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/