అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సిఎం

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ క్రేజివాల్‌ ఢిల్లీఓ వాతావరణ కాలుష్యానిన అరికట్టడంలో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు సరి-బేసు సంఖ్య విధానిన్ని ఆయన తీసుకొచ్చారు. . సామాన్య మానవుల సంక్షేమాన్ని ఆలోచించి ఢిల్లీలో విద్యుత్‌ ఛార్జీలను సగానికి సగం తగ్గించి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ మెట్రో, నగర ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించి మరోసారి ఆశ్చర్యపరిచారు. అయితే 2020లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పొంచి ఉన్న సందర్భంగానే సిఎం అరవింద్‌ కేజ్రివాల్‌ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశం అయింది. దీన్ని పొగిడిన వారు, తెగిడిన వారూ ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లను బీజేపీ గెలుచుకోవడం, కాంగ్రెస్‌ రెండోస్థానం, ఆప్‌ మూడో స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/