సీఎం ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తాం

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారయణస్వామి వెల్లడి

V. Narayanasamy
V. Narayanasamy

వాషర్‌మెన్‌పేట: ఎరుపు రంగు రేషన్‌ కార్డుదారులు మినహాయించి మిగిలిన అన్ని రేషన్‌కార్డుదారులకు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారయణస్వామి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ అనే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం అన్ని రాష్ట్రాల్లో దారిద్రరేఖకు దిగువన వున్న వారిని ఎంపిక చేసి వారు ఏడాది రూ.5లక్షల వరకు వైద్య చికిత్సలు పొందవచ్చు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో పుదుచ్చేరిలో 1.8 లక్షల మందికి ఎంపిక కాగా, వారిలో ఎరుపు రంగు కార్డుదారులే అధికంగా ఉన్నారు. వీరిని మినహాయించి అన్ని రేషన్‌కార్డుదారులకు ముఖ్యమంత్రి బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు సీఎం నారయణ స్వామి ప్రకటించారు. ఈ మేరకు సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో వైద్య చికిత్సలు పొందలేని వారు సీఎం బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని, ఈ పథకం కోసం రూ.18 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/