మోడి ప్రకటనల్లో నాకు మూడు నచ్చాయి

  • ప్రతి ఒక్కరూ వీటిని స్వాగతించాలి
Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మెడి చేసిన ప్రసంగంపై స్పందించారు. స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడి చేసిన ప్రసంగంలో తనకు మూడు ప్రకటనలు నచ్చాయని చెప్పారు. జనాభాను తగ్గించడం, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను నిషేధించడం, సంపదను సృష్టించే వారిని గౌరవించడం అనే మూడు మంచి నిర్ణయాలని అన్నారు. మోడి చేసిన ఈ మూడు ప్రకటనలను ప్రతి ఒక్కరు స్వాగతించాలని చెప్పారు. జనాభా, ప్లాస్టిక్ కు సంబంధించిన అంశాలు ప్రజలతో ముడిపడి ఉన్నవని… వీటి కోసం ఎన్నో సామాజిక సేవా సంస్థలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని తెలిపారు. సంపదను సృష్టించే వారిని గౌరవించాలంటూ మోడి చెప్పిన మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి, ట్యాక్స్ అధికారులు, విచారణ సంస్థలు అధికారులు మరోసారి వినాలని, పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/