పార్లమెంట్‌కు హాజరైన చిదంబరం

రాజ్యసభలో మాట్లాడే అవకాశం?

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: నిన్నటి వరకు తీహార్ జైలులో ఉన్నా కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. అయితే, ఐన్‌ఎక్స్ మీడియా కేసులో మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఐన్‌ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు గతనెల 15న చిదంబరానికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆయనపై ఉన్న ఆరోపణల దృష్ట్యా బెయిలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. అయితే, ఆయన సుప్రీంకోర్టును అశ్రయించగా బెయిల్ వచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/