బెయిల్‌ కోసం చిదంబరం పిిటిషన్‌

chidambaram
chidambaram


న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ కోసం న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బుధవారం చిదంబరం పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాక ఈ కేసులో తనను జ్యూడీషియల్‌ కస్టడకి అప్పగిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 21న చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/