అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉంది

జైలు నుండి విడుదలయ్యాక చిదంబరం తొలి ప్రెస్‌మీట్‌

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: ఐన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశానో అందరికీ తెలుసని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూల్చిందని, ఆర్థిక పరిస్థితిపై ప్రధానమంత్రి మోదీ ఏనాడూ మాట్లాడలేదని చిదంబరం విమర్శించారు. దేశంలో ఉల్లి ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. ప్రజలకు బిజెపినేతలు చాలా హామీలిచ్చారని, వాటి గురించి పట్టించుకోవట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/