మరో ఐదు రోజులు సీబీఐ కస్టడీకి ఇవ్వండి

చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత నడుమ ఆయన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. చిదంబరం రిమాండ్‌ ప్రతిని తుషార్‌ మెహతా న్యాయమూర్తికి అందజేశారు. అరెస్ట్‌ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరిచినట్లు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. 2 గంటల్లో హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇస్తే చిదంబరం నుంచి స్పందన రాలేదని న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పాటు ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూపించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదని తుషార్‌ మెహతా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐదు రోజుల పాటు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలని తుషార్‌మెహతా కోరారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/