దేవేగౌడతో సమావేశమైన చంద్రబాబు

Chandrababu ,Deve Gowda, kumaraswmy
Chandrababu ,Deve Gowda, kumaraswmy

బెంగళూరు: ఏపి సిఎం చంద్రబాబు మంగళవారం అర్థరాత్రి బెంగళూరులోని పద్మనాభనగరలో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసనికి వెళ్లి ఆయన కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. 22 ప్రాంతీయ పార్టీల నేతలు మంగళవారం ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారని, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈవీఎంల పున:వినియోగంపై కేంద్రం ద్వంద్వ నీతి పాటిస్తోందన్నారు. భాజపా గతంలో ఈవీఎంల పనితీరుపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, ప్రస్తుతం ప్రతిపక్షాల ఆక్షేపణలను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హోటళ్లు, ఇళ్లలో యంత్రాలను భద్రపరుస్తున్నారని, ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంలను తరలించటం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ వివిధ అంశాలపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రత్యేక ప్రణాళికలతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, టిడిపి సీనియర్‌ నేత కంభంపాటి రామమోహన్‌రావు పాల్గొన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/