నేడు రాహుల్‌తో భేటి కానున్న చంద్రబాబు

Chandrababu
Chandrababu

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబు చంద్రగిరి రీపోలింగ్‌ విషయంపై ఈసీని కలవడానికి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈసీని కలిసిని తరువాత వెంటనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిలీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈనెల 23న వెలువడే ఫలితాలు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయన్న అంచనాతో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు చేయాల్సిన కసరత్తుపై వీరితో చర్చించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఈరోజు ఉదయం 10 గంటలకు ఇక్కడ రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. తర్వాత దీనిపై మరింత స్పష్టత తీసుకొని మిత్రపక్షాలతో సంప్రదింపులు జరపడానికి చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత వీలయితే సోనియాగాంధీతోనూ ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/