అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

amit shah
amit shah

న్యూఢిల్లీ: దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌ బల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు శనివారం లేఖను రాశారు. మహిళలపై లైంగికదాడి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే మహిళ, రక్షణ కొరకు కేంద్రానికి పలు సూచనలు కూడా చేయవచ్చని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కోరింది. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడి కేసులను రెండు నెలల్లో విచిరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, ఉన్నావ్‌, ఉత్తర భారత్‌లో పలు ముఖ్య నగరాల్లో సహా అనేక ప్రాంతాల్లో దారుణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చుతూ చట్టాలను కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/