ఉల్లి దిగుమతికి కేంద్ర గ్రీన్‌ సిగ్నల్‌

onions
onions

న్యూఢిల్లీ: పెరిగిన ఉల్లి ధరలను సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం వంటల్లో వాడే ఉల్లి ధర ఆకాశానికెగబాకడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం ఉల్లి ధరలు అదుపులోకి తెచ్చేందుకు ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడేమో ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందు సిద్ధమయింది. ఇప్పటికే ఎంఎంటిసి ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ యేడాది ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయలు రూ.80 వరకూ వచ్చాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగల సీజన్‌ కావడం, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ నెలాఖరులో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రజావ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఉల్లి ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో భారీ వరదలు రావడంతో దిగుమతి ఒక్కసారిగా తగ్గింది. దాంతో ధరలు పెరిగాయని చెప్పారు.
తాజా జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/