రాబర్డ్‌ వాద్రాకు సీబీఐ కోర్టులో ఊరట

Robert Vadra
Robert Vadra

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్డ్‌ వాద్రాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. అమెరికా, నెదర్లాండ్స్‌లలో పర్యటించేందుకు కోర్టు అనుమతిచ్చింది. వైద్య సేవల నిమిత్తం ఆరు వారాలపాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. అయితే లండన్‌ వెళ్లేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో లండన్ పర్యటనకు సంబంధించి తన పిటిషన్‌ను వాద్రా విత్ డ్రా చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవధిలో లుక్ ఔట్ నోటీసులు జారీ అయితే.. తమ తాజా ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/