ఇంద్రాణీని విచారించనున్న సీబీఐ

indrani-mukerjea
indrani-mukerjea

ముంబయి: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జియాను మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారించనుంది. తన కూతురు షీనా బోరా కేసులో ముంబైలోని బైకుల్లా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను మరి కాసేపట్లో విచారించనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ముంబయిలోని ప్రత్యేక కోర్టు అనుమతికి ముందు ఇంద్రాణీపై అప్లికేషన్‌ను సీబీఐ ఫైల్ చేసింది. ఇంద్రాణీ ముఖర్జీయా.. ఐఎన్ఎక్స్ మీడియాకు గతంలో అధినేతగా పని చేశారు. ఏడాది క్రితం పి.చిదంబరం సహా ఆయన కుమారుడికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితులని ఢిల్లీ హైకోర్టు ఎదుట చెప్పారు. కాగా, ఇంద్రాణీ వాంగ్మూలానికి అనుగుణంగా సాక్ష్యాధారాలు సేకరించాలని కోర్టు సూచించింది. ఈ కేసులో అరెస్టైన చిదంబరం, ప్రస్తుతం తీహార్ జైల్లోని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/