చిదంబరం కస్టడీ వచ్చే నెల వరకూ పొడిగింపు

chidambaram
chidambaram


న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర ఆర్థిక, హోంశాఖల మాజీ మంత్రి పిచిదంబరానికి మరో ఎదురు దెబ్బ తలిగింది. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉందని, కస్టడీ పొడిగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. ఆయన కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా చిదంబరాన్ని తీహార్‌ జైలులోనే ఉంచాలని సూచించింది. చిదంబరంపై ఉన్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుపై విచారణ కొద్దిరోజుల పాటు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో కొనసాగింది. అనంతరం ఆయనను తీహార్‌ జైలుకు తరలించాలని న్యాయస్ధానం ఆదేశించింది. చిదంబరం తీహార్‌ జైలులో ఏడో నెంబర్‌ కాంప్లెక్స్‌లో ఈ నెల 5వ తేదీ నుండి ఉంటున్నారు. నేటితో ఆయన కస్టడీ పూర్తయినప్పటికీ సిబిఐ అధికారులు ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఆ వెంటనే సిబిఐ తరఫు న్యాయవాది, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. చిదంబరం తరపున కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబాల్‌ వాదించారు. చిదంబరం వయసును దృష్టిలో ఎంచుకుని ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/