పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు

Nitin Gadkari
Nitin Gadkari

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వృద్ధి జరగలేదు. అంతేగాక నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా ఉంది. నాటి ప్రధాని హామీ ఇచ్చిన ప్రకారం ప్రత్యేక హోదా ఇంకా రాలేదు’ అని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి అవినాశ్‌ లోక్‌సభలో గుర్తుచేశారు. ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతు ఏపికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని ఈ మేరకు సమాధానమిచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం మినహా ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. విశాఖలో నెలకొల్పిన మెడిటెక్‌ జోన్‌ బాగా పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/