పశ్చిమ్‌ బెంగాల్‌లో నిరసన ఉద్ధృతం..

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ బస్సులకు నిప్పు

mob violence
mob violence

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు పశ్చిమ్‌ బెంగాల్‌లో నిరసనను ఉద్ధృతం చేశారు. బస్సులను తగలబెట్టారు. హౌరా, సంక్రాలి రైల్వే స్టేషన్‌లకు నిప్పుపెట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్‌, నార్త్‌ 24 పరగణాల్లో  ఆందోళనకారులు జాతీయ రహదారి 34 పై టైర్లకు నిప్పుపెట్టి వాహనరాకపోకలను అడ్డుకున్నారు. జాతీయ రహదారి 6పైన కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  బంగాల్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్‌ విచారం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు బాధకు గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన విధంగా భారత రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. నా వరకు నేను చట్టాన్ని పరిరక్షించేందుకు సహాయం చేస్తాను’ అంటూ గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ ట్వీట్‌ చేశారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/