సమ్మె కారణంగా స్తంభించిన ముంబయి

Buses go off Mumbai roads
Buses go off Mumbai roads

ముంబయి: కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కార్మిక సంఘాల సమ్మెతో ముంబయి స్తంభించిపోయింది. ఈసమ్మెలో బ్రహెన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సైప్లె మరియు ట్రాన్స్‌ పోర్టు వారు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్రహెన్ ముంబై కార్పొరేషన్ లో ఎలక్ట్రిసిటీ మరియు ట్రాన్స్ పోర్టు బడ్జెట్ ను కలపాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె కారణంగా ముంబైలో 33 వేల మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. 2,259 మంది కండక్టర్లు, 2,200 మంది డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 27 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అసోం, మేఘాలయ, మణిపూర్, బీహార్, రాజస్థాన్, గోవా, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా రాష్ర్టాల్లో సమ్మె ప్రభావం అధికంగా ఉంది.