నవభారత్ నిర్మాణానికి కృషి చేయాలి

Parliament Session

News Delhi: నవభారత్ నిర్మాణానికి అంతా కృషి చేయాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  అన్నారు. పార్లమెంట్ సమాశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ…. గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, పటేల్, లోహియా, దీన్ దయాల్ ఆశయాలకు అనగుణంగా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలన్నారు. పలు కీలక బిల్లులకు గతంలో ఆమోదం తెలిపామన్నారు. ఈ దశాబ్దం ఎంతో కీలకమన్నారు.

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం చరిత్రాత్మకం

కారిడార్‌ ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో నన్‌కానా సాహిబ్‌ సందర్శించడానికి సిక్కు భక్తుల కోసం ఈ కారిడార్ ప్రారంభించారు.

ఆర్టికల్ 370 రద్దు గొప్ప నిర్ణయం

ఆర్టికల్ 370 రద్దు గొప్ప నిర్ణయమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ సమాశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ….హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేలా కొత్తబిల్లులు తీసుకొచ్చామన్నారు. రాజ్యాంగానుసారం పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

 జమ్ము కాశ్మీర్‌ ప్రజలకు లబ్ధి

జమ్ము కాశ్మీర్‌ ప్రజలకు ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుతున్నదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌ ప్రజలకు దేశ ప్రజలతో సమానంగా హక్కులు లభించాయని ఆయన చెప్పారు. కాశ్మీర్‌ వ్యాలీలో వివిధ విద్యాసంస్థలు ప్రారంభించనున్నామని ఆయన అన్నారు

ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ పెంచేందుకు కృషి 

ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ పెంచేందుకు తన ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజనుల కోసం అనేక పథకాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన అన్నారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/