ప్రవాస భారతీయులకు ఆధార్‌ కార్డులు

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: లోక్‌సభ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చల్లటి కబురు చెప్పారు. భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నఎన్ఆర్ఐలు తిరిగి స్వదేశానికి రాగానే వారికి ఆధార్ కార్డులు ఇస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆధార్ పొందేందుకు 180 రోజులు వేచిచూడాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఆ నిబంధనతో పనిలేకుండానే వారికి ఆధార్ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇంతవరకూ భారతదేశానికి దౌత్య కార్యాలయాలు లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. అయితే ఇందులో భాగంగా ఆఫ్రికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 18 కొత్త దౌత్య కార్యాలయాలు తెరవనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.

తాజా ఎన్‌ఆర్‌ఐ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/